Site icon HashtagU Telugu

Telangana: దసరా తర్వాత రెండో జాబితా విడుదల

Telangana (50)

Telangana (50)

Telangana: తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ దసరా పండుగ తర్వాత రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. 52 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితాను విడుదల చేశామని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని, దసరా తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. అందులో భాగంగా అమిత్ షా అక్టోబర్ 27న రాష్ట్రంలో పర్యటిస్తారని, యోగి ఆదిత్యనాథ్ అక్టోబర్ చివరి వారంలో వస్తారని తెలిపారు.

Also Read: world cup 2023: టీమిండియా పాంచ్ పటాకా… కివీస్ పై భారత్ విజయం