Site icon HashtagU Telugu

BJP Suspends Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిష్కరణ

Rajasingh

Rajasingh

భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పార్టీ వేటుపడింది. మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ స్పందించింది. దేశ సమగ్రతకు భంగం కల్పించేలా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ లైన్ దాటారన్న నెపంతో రాజాసింగ్ ను సస్పెన్షన్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. గతంలో నుపూర్ కామెంట్స్ కంటే దారుణంగా రాజాసింగ్ మాట్లాడారని వాదన మొదలైంది. ఇప్పటికే ఎల్బీనగర్, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి.

రాజాసింగ్ పై చర్య తీసుకోకపోతే దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం కేంద్రం వద్ద ఉంది. భారతీయ జనతా పార్టీ లైన్ దాటి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు మిన్నంటాయి. ప్రస్తుతం రాజాసింగ్ 10 రోజుల్లో పార్టీకి జవాబు ఇవ్వాల్సి ఉంది. రాజాసింగ్ కు నోటీసులు జారీ అయ్యాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 153a (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (మతాన్ని అవమానించే ఉద్దేశ్యంతో అపవిత్రం చేయడం) 505 (పబ్లిక్ రెచ్చగొట్టడం ) లాంటి అంశాల కింద రాజాసింగ్ ను  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.