Delhi Updates: కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాలి: ఢిల్లీ బీజేపీ

ఢిల్లీలో బీజేపీ ధర్నాకు దిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాజధానిలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట బిజెపి కార్యకర్తలు నిరసన చేపట్టారు

Delhi Updates: ఢిల్లీలో బీజేపీ ధర్నాకు దిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాజధానిలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట బిజెపి కార్యకర్తలు నిరసన చేపట్టారు.ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులపై వాటర్‌ కెనాన్‌లు ప్రయోగించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాతో పాటు ఇతర ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

కేజ్రీవాల్ ప్రభుత్వ వైఫల్యంతో ఢిల్లీలో వరదలు వచ్చాయని బీజేపీ విమర్శించింది. రీజినల్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్), మెట్రో, నేషనల్ హైవే, టన్నెల్ రోడ్ సహా ఇతర ప్రాజెక్టుల కోసం ఢిల్లీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ ఆరోపించింది. మునిసిపల్ కార్పొరేషన్‌కు అధికారం లభించిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ దానిని అవినీతి గూడగా మార్చిందని దుయ్యబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ అవినీతి ఉందని మండిపడ్డారు. .ప్రభుత్వం అరాచకాల వల్ల ఢిల్లీ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని,.ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి లేదని, అతను వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది ఢిల్లీ బీజేపీ నాయకత్వం.

Also Read: Jagan : సీఎం పదవిలో ఉండి నిరుపేదల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నాడు – గంటా శ్రీనివాస్