Site icon HashtagU Telugu

Dr K. Laxman: లక్షణ్ కు బంపరాఫర్.. రాజ్యసభకు నామినేషన్!

Laxman1

Laxman1

టీబీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ కు తగిన ప్రాధాన్యం లభిస్తోంది. బీజేపీ నాయకత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి డాక్టర్‌ లక్ష్మణ్‌ నామినేషన్‌ వేయనున్నట్లు పార్టీ ప్రకటించింది. డాక్టర్ లక్ష్మణ్ బిజెపి ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు. గతంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అతని పేరుతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మిథిలేష్ కుమార్ పేరు కూడా ప్రకటించారు. పార్టీ గతంలో రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురిని నామినేట్ చేసింది. అక్కడ ఎనిమిది మందిని రాజ్యసభకు పంపవచ్చు. ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో, లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.