Site icon HashtagU Telugu

Modi Arrives Hyderabad: ప్రధాని మోడీకి ఘన స్వాగతం

Modi

Modi

బీజేపీ జాతీయ సమావేశల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు. గవర్నర్ తో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. ప్రధానికి మర్యాదపూర్వకంగా స్వాగతం చెప్పి పుష్పగుచ్ఛాలు అందించారు. అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రధానిని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన గైర్హాజరు కావడంతో మంత్రి తలసాని వెల్ కం చెప్పారు.  “@BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్‌లో దిగారు. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం’ అని మోడీ ట్వీట్ చేశారు.

పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 350 మంది ప్రతినిధులు జాతీయ కార్యవర్గానికి హాజరుకానున్నారు. జాతీయ కార్యవర్గం గత కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించి, పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తుంది. సమావేశాలను పురస్కరించుకొని హైదరాబాద్ కాషాయ రంగులతో ముస్తాబైంది. ఎక్కడా చూసినా బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

Exit mobile version