Site icon HashtagU Telugu

BJP : డిసెంబ‌ర్ 15న తెలంగాణ‌కు బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

Bandi Sanjay Imresizer

Bandi Sanjay Imresizer

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఐద‌వ విడ‌త పాద‌యాత్ర‌ ముగింపు సంద‌ర్భంగా ఈ నెల 15న క‌రీంన‌గ‌ర్‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ‌కు ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌రుకానున్నారు. బండి సంజ‌య్ ఐద‌వ విడ‌త ప్రజా సంగ్రామ యాత్ర నవంబర్ 28 న నిర్మల్ జిల్లాలో నుంచి ప్రారంభ‌మైంది. గత ఏడాది హైదరాబాద్‌లోని చార్మినార్‌భాగ్యలక్ష్మి ఆలయం నుండి బండి సంజ‌య్ మొదటి దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే పాద‌యాత్ర‌లో అనేక సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఐద‌వ విడ‌త పాద‌యాత్ర ముందు భైంసాలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయిన‌ప్ప‌టికి బండి సంజ‌య్ పాద‌యాత్ర చేస్తున్నారు. డిసెంబ‌ర్ 15 న ఐద‌వ విడ‌త పాద‌యాత్ర ముగియ‌నుంది.