Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా ప్రకటించింది.

  • Written By:
  • Updated On - June 21, 2022 / 10:50 PM IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా ప్రకటించింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా అభ్యర్థిని ప్రకటించారు. అనేకమంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అన్నారు. మంత్రిగా, గవర్నర్‌గా ఆమె రాణించారని ప్రశంసించారు.