Site icon HashtagU Telugu

Ravi Kishan Daughter: సైన్యంలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కుమార్తె.. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న నెటిజ‌న్లు

Mp Ravikishan

Mp Ravikishan

సినీ న‌టుడు, బీజేపీ ఎంపీ ర‌వి కిష‌న్ (MP Ravi Kishan) కుమార్తె ఇషితా శుక్లా (Ishita Shukla) భార‌త డిఫెన్స్ ఫోర్స్ (Indian Defense Force) లో చేరారు. గ‌తేడాది భార‌త ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకొచ్చిన అగ్నిపథ్ ప‌థ‌కం (Agnipath scheme) లో భాగంగా ఆమె అగ్నివీర్‌ (agniveer )గా మారారు. ఈ విష‌యాన్ని ర‌వికిష‌న్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇషితా వ‌య‌స్సు 21ఏళ్లు. అతి చిన్న వ‌య‌స్సులోనే స‌రిహ‌ద్దుల్లో దేశ‌సేవ కోసం ఆమె సిద్ధ‌మ‌య్యారు. అగ్ని ప‌థ్ ప‌థ‌కంలో భాగంగా నాలుగేళ్లు సైన్యంలో సేవ‌లందించేందుకు గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసింది. ర‌వికిష‌న్ కుమార్తె ఇషితా అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద ఆర్మీలో చేర‌డంతో నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నాయి.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ర‌వికిష‌న్ త‌న కుమార్తె గురించి ఓ ట్వీట్ చేశారు. నా కుమార్తె ఇషితా శుక్లా మ‌న దేశానికి సేవ చేసేందుకు గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా చాలా క‌ష్ట‌ప‌డుతుంది. ఆమె ఢిల్లీ డైరెక్ట‌రేట్‌లోని ఏడ‌వ బాలిక‌ల బెటాలియ‌న్‌కు చెందిన క్యాడెట్‌. చ‌లిలో శిక్ష‌ణ పొందుతోంది. క‌ర్త‌వ్య మార్గంలో రిప‌బ్లిక్ డే ప‌రేడ్ కోసం పొగ‌మంచుతో పోరాడుతోంది. ఒక తండ్రిగా గ‌ర్వించ‌ద‌గిన క్ష‌ణం జ‌న‌వ‌రి 26న రాష్ట్ర‌ప‌తి ముందు ఆమె జాతీయ క‌వాతులో పాల్గొంటారు అని అన్నారు. అంతేకాక ఢిల్లీలో జ‌రిగిన రిప‌బ్లిక్ ప‌రేడ్‌లో 147 మంది అమ్మాయిల‌తో క‌లిసి ఇషిత కూడా పాల్గొన్నారు. ఆమె 2022లో ఎన్‌సీసీ ఏడీజీ అవార్డ్ ఆప్ ఎక్స్‌లెన్స్ అవార్డు ల‌భించింది. క‌ల్న‌ల్ రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ అవార్డు ఇషిత అందుకున్నారు.

ఇషితా శుక్లా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీలు, వీడియోల‌ను చూస్తే ఆమెకు ఆర్మీపంట్ల ఎంతఅభిమానం ఉందో అర్థ‌మ‌వుతుంది. ఇషితాకు ఇద్ద‌రు సోద‌రిలు, ఒక సోద‌రుడు ఉన్నారు. పెద్ద‌క్క త‌నిష్క శుక్లా వ్యాపార రంగంలో ఉన్నారు. బిజినెస్ మేనేజ‌ర్‌, ఇన్వెస్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. రెండో అక్క రివా కిష‌న్ బాలీవుడ్ న‌టి. ప‌లు బాలీవుడ్ చిత్రాల్లో ఆమె న‌టించారు. ఇషిత త‌మ్ముడు పేరు సాక్ష్యం శుక్లా. ర‌వికిష‌న్ భోజ్‌పురి న‌టుడు. తెలుగులోనూ ప‌లు సినిమాల్లో న‌టించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా న‌టించిన రేసుగుర్రం సినిమాలో విల‌న్‌గా న‌టించాడు. మ‌ద్దాలి శివారెడ్డి క్యారెక్ట‌ర్ ర‌వికిష‌న్‌కు మంచిపేరు తెచ్చింది.

Ajmer Dargah: అజ్మీర్ దర్గాలో డాన్స్ చేసిన మహిళ.. వీడియో వైరల్?