Site icon HashtagU Telugu

Rajveer Singh Diler: బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ సింగ్ మృతి

Rajveer Singh Diler

Rajveer Singh Diler

Rajveer Singh Diler: బీజేపీ హత్రాస్ ఎంపీ రాజ్‌వీర్ సింగ్ దిలేర్ గుండెపోటుతో మరణించారు. ఆయనకు 66 ఏళ్లు. అలీగఢ్‌లోని ఆయన నివాసంలో సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి స్పృహతప్పి పడిపోయారు. బంధువులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

2019లో హత్రాస్ లోక్‌సభ స్థానం నుంచి రాజ్‌వీర్ సింగ్ దిలేర్ 2.60 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో ఆయన స్థానంలో దేవాదాయ శాఖ సహాయ మంత్రి అనూప్ వాల్మీకిని అభ్యర్థిగా నియమించారు. అయితే పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ రాజ్‌వీర్ సింగ్ దిలేర్ నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లాలని అనుకోలేదు.

రాజ్‌వీర్ సింగ్ దిలేర్ రెండు రోజుల క్రితం అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజ్‌వీర్ సింగ్ దిలేర్ తండ్రి కిషన్‌లాల్ దిలేర్ కూడా సీనియర్ బీజేపీ నాయకుడు. ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఉన్నారు. రాజ్‌వీర్ దిలేర్ మృతి వార్తతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజ్‌వీర్ సింగ్ మరణం పార్టీకి తీరని లోటనే చెప్పాలి.

Also Read: Nagarjuna : ధనుష్ కుబేరలో నాగార్జున రోల్ అదేనా..?