తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లోని తన ఎంపీ క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనపై కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు పాటించలేదని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సంజయ్ పై కేసులు నమోదు చేశారు.
ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా ధర్మపురి అరవింద్ పై ఐపీసీ సెక్షన్ 504, 552, 506 కింద కేసు నమోదు చేశారు.
నవంబర్ 8న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఓపిక నశిస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. ఇక తాజాగా పెడుతున్న కేసులు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని జైల్లో పెట్టడం, aa పార్టీకే చెందిన మరో ఎంపీపై కేసులు నమోదు చేయడంతో కేసీఆర్ పైచేయి సాధించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
https://twitter.com/Arvindharmapuri/status/1478046030344056832
#BJP4GovtEmployees pic.twitter.com/pddg0r82xf
— Arvind Dharmapuri (@Arvindharmapuri) January 3, 2022