Site icon HashtagU Telugu

MP Arvind: టీఆర్ఎస్ దాడిపై అరవింద్ రియాక్షన్.. అమ్మను బెదిరించారంటూ ట్వీట్!

Aravind2

Aravind2

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita)పై వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) నివాసంపై దాడి చేశారు. ఇంట్లోని అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడిపై ఎంపీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాలపై హైదరాబాద్‌లోని నా ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ… బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు’’ అంటూ ఎంపీ అర్వింద్  ట్వీట్ చేశారు. మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  ఫోన్ చేశారు. అరవింద్ నివాసంపై దాడి ఘటన వివరాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడంతో ఎంపీ అరవింద్ ఇంటి దగ్గర ఉత్రిక్తత నెలకొంది.