BJP MLAs Suspended : సింహాలపై అసెంబ్లీ వేటు

బ‌డ్జెట్ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా రాజ్యాంగాన్ని కేసీఆర్ స‌ర్కార్ అగౌర‌ప‌రుస్తోంద‌ని బీజేపీ ఎమ్మెల్యేలు నిర‌స‌న‌కు దిగారు. దీంతో ఈ అసెంబ్లీ స‌మావేశాల వ‌ర‌కు ఈటెల రాజేంద్ర‌, ర‌ఘునంద‌న్‌, రాజాసింగ్ ల‌ను అసెంబ్లీ బ‌హిష్క‌రించింది.

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 02:05 PM IST

బ‌డ్జెట్ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా రాజ్యాంగాన్ని కేసీఆర్ స‌ర్కార్ అగౌర‌ప‌రుస్తోంద‌ని బీజేపీ ఎమ్మెల్యేలు నిర‌స‌న‌కు దిగారు. దీంతో ఈ అసెంబ్లీ స‌మావేశాల వ‌ర‌కు ఈటెల రాజేంద్ర‌, ర‌ఘునంద‌న్‌, రాజాసింగ్ ల‌ను అసెంబ్లీ బ‌హిష్క‌రించింది. ఆ ముగ్గుర్ని మార్చి 7, సోమవారం నుంచి అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఆ మేర‌కు తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్ర‌వేశ‌పెట్ట‌గా స‌భ అమోదించింది.
బడ్జెట్ సెషన్ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగాన్ని షెడ్యూల్ చేయలేద‌ని ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. గ‌త బడ్జెట్ సెషన్‌కు కొనసాగింపుగా బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నందున గవర్నర్‌ ప్రసంగం అవసరం లేదని టీఆర్‌ఎస్ వివ‌ర‌ణ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ బీజేపీ సభ్యులను ఆందోళ‌న ఆగ‌లేదు. దీంతో స‌భ‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బీజేపీ ఎమ్మెల్యేల‌ను బ‌హిష్క‌రిస్తూ స‌భ ఆమోదించింది. ఐదు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగితే, దానిని కొత్త సెషన్‌గా పరిగణిస్తామని గవర్నర్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కానీ, టీఆర్ఎస్ మాత్రం గ‌త సెష‌న్ కొన‌సాగింపు అంటూ వాదిస్తోంది. ఆ వాద‌న‌పై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు మండిప‌డుతున్నాయి. రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షకుడి పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘అగౌరవ వైఖరి’ ప్రదర్శిస్తోందని విప‌క్ష స‌భ్యులు ఆరోపించారు.