Site icon HashtagU Telugu

Raja Singh : ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌.. కార‌ణం ఇదే..?

Raja Singh Bjp 1 (1)

Raja Singh Bjp 1 (1)

ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేస్తే బీజేపీ నేతలు ప్రమాణం చేయబోరని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు (డిసెంబర్ 9వ తేదీన) జరగనున్న తెలంగాణ శాసనసభ తొలి సమావేశానికి అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఖాసిం ర‌జ్వీ వార‌సుడి ముందు తాను ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌న‌ని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాట‌లోనే న‌డుస్తుంద‌ని రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో BRS అధికారంలోకి వచ్చినప్పుడు ‘కారు’ స్టీరింగ్‌ను AIMIM చేతిలో వదిలి పెద్ద తప్పు చేశారన్నారు. ఏఐఎంఐఎం పట్ల కాంగ్రెస్ ‘స్నేహపూర్వక వైఖరిని ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని రాజాసింగ్ ఆరోపించారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకోవడం ద్వారా మైనారిటీలను ప్రలోభపెట్టడానికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Also Read:  CBN : ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్బాగ్యం : టీడీపీ అధినేత చంద్ర‌బాబు