Bjp Mission : 2024కు వ్యూహం సిద్ధం చేస్తున్న అమిత్ షా, నడ్డా…మొదటి దశలో 144 సీట్లపై దృష్టి..!!

2024లో జరగనున్న లోకసభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఇవాళ సమావేశం కానున్నారు.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 12:19 PM IST

2024లో జరగనున్న లోకసభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఇవాళ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 2024లోకసభ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 144 లోకసభస్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ బ్లూప్రింటును సిద్ధం చేస్తుంది. ఇందులో  గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన స్థానాలపై పార్టీ ఫోకస్ పెట్టనుంది.

కేంద్ర మంత్రులకు బాధ్యతలు..!!
144 లోకసభ స్థానాలను గ్రూపులుగా విభజించి…ఒక్కో గ్రూపుకు ఒక్కో కేంద్ర మంత్రిని ఇంచార్జీగా నియమించే ఛాన్స్ ఉంది. రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకు మరొక మంత్రుల బృందం పశ్చిమబెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను సందర్శించనున్నాయి. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ 144 లోకసభ స్థానాల జాబితాలో 2019 ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడో స్థానంలో  నియోజకవర్గాలు ఉన్నాయి.

బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవ్య, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయనున్నారు.

నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితిని అంచనా వేస్తారు..
దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను సేకరిస్తారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితిని మంత్రులు విశ్లేషించి 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీసుకోవల్సిన చర్యలను గుర్తిస్తారు. నియోజకవర్గాల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతున్నారు దాని వెనక ఉన్న కారణాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన బ్లూప్రింటును…పార్టీ సిద్ధం చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి.