దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లుగానే ఉత్తర్ ప్రశ్‌లో బీజేపీ దుమ్మురేపుతూ ముందంజలో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం 182 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఇక మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 102 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంది. ఇకపోతే బీఎస్సీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు గొరఖ్ పూర్ నుంచి యోగి ఆదిత్యానాధ్ ముందంజలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హల్ నియోజకవర్గంలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.