Site icon HashtagU Telugu

Manipur Election Results 2022: ఉత్త‌రాఖండ్‌లో దూసుకుపోతున్న బీజేపీ..!

Uttarakhand Election Results 2022

Uttarakhand Election Results 2022

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈరోజు విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైంది. ఈ క్ర‌మంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిట్ ఫ‌లితాల అంచ‌నాలు నిజ‌మ‌వుతున్నాయి. తాజా ఎన్నిక‌ల రిపోర్ట్స్ గ‌మ‌నిస్తే, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండ‌గా, గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంది. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది.

ఇక ఇప్ప‌టికే ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగ‌ర్ దాటింది. దీంతో యూపీలో మ‌రోసారి యోగీ స‌ర్కార్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. అలాగే మ‌ణిపూర్‌లో కూడా బీజేపీ అధిక్యంలో కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డ దాదాపుగా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయం. ఇక మ‌రోవైపు ఉత్త‌రాఖండ్‌లో కూడా బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. అక్క‌డ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉంగా, ఇప్ప‌టికే బీజేపీ 44 స్థానాల్లో అధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా, బీఎస్పీ 2 స్థానాల్లో, ఇత‌రులు 2 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు. దీంతో ఉత్త‌రాఖండ్‌లో కూడా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.