Site icon HashtagU Telugu

Manipur Election Results 2022: మ‌ణిపూర్‌లో బీజేపీ హ‌వా..!

Manipur Election Results 2022

Manipur Election Results 2022

ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, ఉత్తరాఖండ్​, మణిపూర్​, గోవా రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో దుమ్మురేపుతూ మ‌రోసారి అధికారం చేప‌ట్టే దిశ‌గా దూసుకుపోతున్న బీజేపీ, మ‌ణిపూర్‌లో కూడా సత్తా చాటుతోంది.

ఈ నేప‌ధ్యంలో మ‌ణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండ‌గా, బీజేపీ ప్ర‌స్తుతం 27 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా, ఎన్‌పీపీ 10 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా, ఎన్‌పీఎఫ్ 5 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. దీంతో మ‌ణిపూర్‌లో కూడా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా ఒక్క పంజాబ్‌లో త‌ప్పా మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భంజ‌నం సాగుతోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.