ఏపీకి రాజకీయాలు మరింత వేడెక్కాయి. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest)..పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం..టీడిపి తో పొత్తు ఫిక్స్ చేయడం ఇవన్నీ ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశాయి. మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్..బిజెపి తో కలిసి పనిచేస్తున్నాం..రాబోయే ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తామని చెపుతూ వచ్చారు. బిజెపి నేతలు సైతం జనసేన పార్టీ మీము ఒకటే అనుకుంటూ వచ్చారు. అయితే ఏపీలో బిజెపి హావ పెద్దగా లేదు. దీంతో టీడిపి ని కూడా కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ ఆలోచిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని బిజెపి అధిష్టానానికి కూడా సూచించారు. కాకపోతే వారు ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ లోలోపల మాత్రం పవన్ కు..బిజెపి కలిసిన , కలవకపోయిన టిడిపి తో పొత్తు పెట్టుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ను అక్రమంగా వైసీపీ అరెస్ట్ చేయించడం..బెయిల్ కూడా రానివ్వకుండా చేయడం..తనను ఏపీకి రాకుండా అడ్డుకోవడం ఇవన్నీ చూసి పవన్ ఇక సైలెంట్ కుదరదని..వార్ ప్రకటించాల్సిందేనని గురువారం..జైల్లో చంద్రబాబు ను కలిసిన అనంతరం మీడియా ఎదుట పొత్తు ఫిక్స్ చేసారు. తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కలుస్తున్నామని స్పష్టం చేసారు.
ఈ పొత్తు ప్రకటన తర్వాత బిజెపి (BJP) ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. మిత్రపక్షంగా ఉన్న బిజెపికి మాట మాత్రమేనా చెప్పకుండా పవన్ టిడిపి తో కలుస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు బిజెపి వైఖరిలో సైతం మార్పు వస్తోంది. పవన్ పొత్తు ప్రకటన తర్వాత బిజెపి నేతలు ఒక్కొక్కరుగా ప్రకటనలు ఇస్తున్నారు. టిడిపి,జనసేన లతో బిజెపి పొత్తు ఉంటుందని బాహటంగా ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు పొత్తు ఉండదు అన్న మాట చెప్పే నాయకులు నోరు మెదపడం లేదు. దీంతో బిజెపి విషయంలో ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది.
Read Also : Kapu Community Reaction : టిడిపి తో జనసేన పొత్తు ఫై కాపు సామాజిక వర్గం రియాక్షన్ ఏంటి..?
అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (ap bjp chief Purandeswari) సైతం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ను ఖండించింది. ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయ్యింది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టిడిపి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ..ఆమె సైలెంట్ గానే ఉంది. జనసేన మాత్రం బంద్ కు సపోర్ట్ ఇచ్చింది. బిజెపి మాత్రం అలాంటిదేమి లేదని తెలిపింది. ఇక ఇప్పుడు పవన్ పొత్తుపై అధికారిక ప్రకటన చేసినప్పటికీ..పురందేశ్వరి మాత్రం దీనిపై ఏమాత్రం స్పందించడం లేదు. తాజాగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర్శించారు. రాజమండ్రిలో ఉన్న భువనేశ్వరిని ప్రత్యేకంగా కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే పురందేశ్వరి వ్యక్తిగతంగా కలిశారా? తన సోదరిని పరామర్శించారా? లేక రాజకీయంగా ఏమైనా మాట్లాడారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు బిజెపి నాయకులు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటి నాయకులు పొత్తులపై సానుకూలంగా మాట్లాడారు. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు. కానీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి మాత్రం ఎక్కడా ప్రకటనలు చేయలేదు. మరి పురందేశ్వరి మనసులో ఏముందో..పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని అనుకుంటున్నప్పటికీ …అధిష్టానం ఏంచెపుతుందో తెలియనప్పుడు..ప్రకటన చేస్తే బాగోదని ఆమె సైలెంట్ గా ఉంటూ వస్తున్నారని మరింతకొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం పొత్తు ఫై బిజెపి అధిష్టానం ఏం ప్రకటిస్తుందో..!