Delhi Updates: ఢిల్లీ సీఎం రాజీనామా?

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ ఆప్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు.

Delhi Updates: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ ఆప్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. మద్యం కుంభకోణంపై విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉదయం నార్త్ అవెన్యూలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంపై దాడి చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించారు. సంజయ్ సింగ్ నివాసంలో జరిగిన దాడి ద్వారా ఆప్ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిందని సచ్‌దేవా అన్నారు. మద్యం కుంభకోణంలో పాల్గొన్న వారందరూ త్వరలో కటకటాల పాలవుతారని సచ్‌దేవా చెప్పారు.

ఢిల్లీ బీజేపీ ఆప్ కార్యాలయాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది బీజేపీ. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ హస్తం ఉందంటూ నిరసన తెలుపుతున్న కార్యకర్తల్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు వేసి లోపలి రానివ్వకుండా అడ్డుకున్నారు. కాగా.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణకు సిఫారసు చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని గతేడాది రద్దు చేసింది. అప్పటి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ ఇంచార్జి మనీష్ సిసోడియా ఈ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారు.

Also Read: Forbes Richest List: ఫోర్బ్స్ టాప్-10 సంపన్నుల జాబితాలో అమెరికాకు చెందిన 9 మంది బిలియనీర్లు..!