BJP: ముస్లిం వ్యక్తితో బీజేపీ నేత కుమార్తెకు పెళ్లి.. పెళ్లి పత్రిక వైరల్.. చివరి నిమిషంలో పెళ్లి రద్దు!

ఓ బీజేపీ నేత కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిపించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పెళ్లి పత్రికలను కూడా ప్రింట్ చేయించారు.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 10:44 PM IST

BJP: ఓ బీజేపీ నేత కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిపించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పెళ్లి పత్రికలను కూడా ప్రింట్ చేయించారు. ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. దీంతో జరగాల్సిన పెళ్లి రద్దు అయింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నెటిజన్ల నుంచి అభ్యంతరాలు రావడంతో పెళ్లిని రద్దు చేసినట్లుా తెలుస్తోంది.

పౌరీ మున్సిపల్ చైర్మన్ యశ్ పాల్ బెన్ తన కుమార్తెను ఓ ముస్లిం వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. ఇద్దరూ ఇష్టపడటంతో పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం పెళ్లి పత్రికలు కూడా వేయించారు. పెళ్లి పత్రికలు సోషల్ మీడియలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముస్లిం వ్యక్తితో పెళ్లి ఏంటి అంటూ హిందూ సంఘాలు ఒత్తిడి తీసుుకొచ్చాయి. బీజేపీ మద్దతుదారులతో పాటు హిందూ సంఘాలు విమర్శలు కురిపించారు. అంతేకాకుండా హిందూ సంఘాలు పౌరీలోని ఘుండా చౌక్ లో బీజేపీ నేత యశ్ పాల్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి.

యశ్ పాల్ దిష్టిబొమ్మను హిందూ సంఘాలు దగ్దం చేశాయి. అలాగే వీహెచ్‌పీ, భైరవసేన, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఇలాంటి వివాహలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వీహెచ్‌ీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ గౌడ్ తీవ్ర విమర్శలు కురించారు. ఈ ఆందోళనల క్రమంలో యశ్ పాల్ దిగొచ్చారు. ఆందోళనలు ఉధృతం కావడం, శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉండటంతో ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి రద్దు చేశారు.

తమ కుమార్తె వివాహన్ని పోలీసుల రక్షణలో జరిపించాలని తాను అనుకోవడం లేదని యశ్ పాల్ చెబుతున్నారు. తాను ప్రజల మనోభావాలను గౌరవిస్తానని అన్నారు. వరుడి తరపు వారితో పాటు కుటుంసభ్యులతో చర్చించి త్వరలో పెళ్లిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.