Site icon HashtagU Telugu

BJP leader shot dead: ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చిచంపిన దుండగులు..!!

Jeetu Imresizer

Jeetu Imresizer

దేశ రాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. స్ధానిక బీజేపీ నాయకుడు జీతూ చౌదరిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. వెంటనే అతన్ని స్ధానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జీతూ చౌదరి మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మయూర్ విహార్ లో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు జీతు చౌదరిగా గుర్తించారు. బాధితుడికి బుల్లెట్ గాయాలు ఉండటంతో…ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కీలకమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని రికవరీ చేసుకున్నారు.

కుటుంబం సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జీతూ చౌదరి మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఢిల్లీలోని పాకెట్ సి -1 మయూర్ విహార్ -3 లో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు..జీతు చౌదరిగా గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.