DK Aruna:నా శవంపై ఆ బిల్డింగ్ కట్టండని ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీకే అరుణ

గద్వాలలో పేదల ఇళ్ల స్థలాల్లో నర్సింగ్ కాలేజీని కట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.

గద్వాలలో పేదల ఇళ్ల స్థలాల్లో నర్సింగ్ కాలేజీని కట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.

పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన 70 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం కోసం మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై డీకే అరుణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తన నిర్ణయం అమలుపర్చాలంటే తన మృతదేహంపై ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను నిర్మించాలని డీకే అరుణ తెలిపారు.

గద్వాలలో పేదలకు 5000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాట తప్పి నర్సింగ్ కళాశాల కడుతామని కొత్త డ్రామా ఆడుతున్నాడని కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగానే పేదలకు ఇళ్లు కట్టివ్వాలని ఆమె డిమాండ్ చేసారు.

రాష్ట్ర పోలీసులపై కూడా డీకే అరుణ పలు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఈ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని, కానీ టీఆర్ఎస్ నేతలు చేసే కార్యక్రమానికి పోలీసులే అండగా ఉంటున్నారని డీకే అరుణ విమర్శించారు.