Site icon HashtagU Telugu

Bandi Sanjay: బీజేపీ కార్యకర్త పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన బండి సంజయ్

Bandi Sanjay

New Web Story Copy 2023 06 22t212513.723

Bandi Sanjay: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త వంచ శ్రీకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ మృతుడి స్వస్థలాని వెళ్లి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఆ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో దేవుడు అతని కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని కోరుకున్నారు బండి సంజయ్.

 

బండి సంజయ్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ లాంటి అంకితభావం గల కార్యకర్తను కోల్పోవడం పార్టీకి, వ్యక్తిగతంగా నాకూ తీరనిలోటన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

Read More: Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?