Site icon HashtagU Telugu

Andhra Pradesh: ఏపీలో క‌ల‌క‌లం.. కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హ‌త్య‌..!

Ap Bjp

Ap Bjp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాలలో జ‌రిగిన ఈ ఘటన క‌ల‌క‌లం రేపుతోంది. ఈ క్ర‌మంలో కృష్ణాజిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పార్టీ కార్యక్రమాల కోసం మ‌ల్లారెడ్డి బైక్‌పై వెళ్తుండగా, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిట్యాల వద్ద కొంద‌రు దుండ‌గులు కారుతో ఢీకొట్టి అతన్ని చంపేందుకు ప్రయత్నించారు.

అయితే అక్కడి నుంచి తప్పించుకున్న‌ మల్లారెడ్డిని వెంటాడి కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గ‌తంలో అక్క‌డ‌ మల్లారెడ్డికి ఎవరితోనైనా శతృత్వం ఉందా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అల‌గే మ‌ల్లారెడ్డిని దేనికోసం చంపారు.. హత్య చేసింది సొంత‌వాళ్ళా లేక బయటివాళ్లా అన్న కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక‌పోతే మృతునికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, ఈఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.