Site icon HashtagU Telugu

Donations: బీజేపీ సూక్ష్మ విరాళాలు

మైక్రో డోనేషన్స్ తీసుకోవడానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. కనీసం ఐదు రూపాయల నుంచి విరాళాలు సేకరిస్తుంది. దేశవ్యాప్తంగా ఆదివారం ఈ కార్యక్రమానికి పూనుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాజపా చీఫ్‌ బండి సంజయ్‌కుమార్‌ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రారంభించాడు. మైక్రో’ పేరుతో చిన్న మొత్తాల వసూళ్లు చేస్తున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 11 వరకు విరాళాలు కొనసాగుతాయి.తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి పాపారావు కో-కన్వీనర్‌లుగా బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.ప్రచారంలో భాగంగా రూ. 5 నుండి రూ. 50, రూ. 100, రూ. 500 వంటి చిన్న మొత్తాల విరాళాలు మాత్రమే అంగీకరించబడతాయి. ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే దానం చేయగలడు. వారు ‘నమో’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు వారి పేరు, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని నమోదు చేయడం ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు. వారు Google Pay, Phone Pay, Paytm, Net Banking వంటి డిజిటల్ చెల్లింపు సేవల ద్వారా మాత్రమే విరాళాలు చెల్లించాలి. నగదు మరియు చెక్కులు ఆమోదం పొందవు.

Exit mobile version