Site icon HashtagU Telugu

KCR vs BJP: కేసీఆర్ కామెంట్స్ పై.. బీజేపీ స‌ర్కార్ రియాక్ష‌న్ ఇదే..!

Kcr Bjp

Kcr Bjp

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ స‌ర్కార్ కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా కేసీఆర్ వ్యాఖ్య‌ల పై కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని తాము వత్తిడి చేస్తున్నామని, కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్ని కేంద్ర స‌ర్కార్ ఖండించింది. కేంద్ర ప్ర‌భుత్వం పై కేసీఆర్ త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని, వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీటర్లు బిగించమని రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి వత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

హుజూరాబాద్ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ ఓటమి పాల‌వ‌డంతో, కేసీఆర్‌కు మ‌తి భ్ర‌మించింద‌ని, దీంతో అబద్దాలను ప్రచారం చేస్తూ, బీజేపీ పై బుర‌ద చ‌ల్ల‌డ‌మే లక్ష్యంగా పెట్టుకున్నార‌ని బీజేపీ నేత‌లు కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాము పునరుత్పాదక విద్యుత్తును తాము కొనుగోలు చేయమని చెప్పడం లేదని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్తును తాము కొనుగోలు చేయమని చెప్ప‌లేద‌ని బీజేపీ స్ప‌ష్టం చేసింది. ఇక విద్యుత్తును కొనుగోలు చేసే హక్కు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంటుందని, ఫలనా వారి వద్ద నుంచే విద్యుత్తును కొనాలని కేంద్ర ప్ర‌భుత్వం ఎవ‌రిపైనా వత్తిడి చేయడం లేదని తెలిపింది. తెలంగాణ‌లోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి 55 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చింద‌ని, అయినా ఒక‌ ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా కేసీఆర్ అబద్ధాలు చెప్ప‌డం క‌రెక్ట్ కాదని బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది.

Exit mobile version