Site icon HashtagU Telugu

Surgical Strikes: స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్ కామెంట్స్.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్

Kcr

Kcr

కాంగ్రెస్ కీల‌క నేత‌ రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఇటీవ‌ల స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌ పై రాహుల్ ఆధారాలు అడ‌గ‌గా, రాహుల్ నిజంగానే రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్య‌ల పై ప‌లువురు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాహుల్ పై హిమంత బిస్వా శర్మ చేసిన కామెంట్స్ పై ద్వ‌జ‌మెత్తారు. అస్సాం సీఎంను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీని కేసీఆర్ డిమాండ్ చేశారు.

సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు చూపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంలో తప్పేముందని ప్ర‌శ్నించిన కేసీఆర్, స‌ర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు చూపెట్టాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని బీజేపీ స‌ర్కార్‌ పై కేసీఆర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ వ్యాఖ్య‌ల పై బీజేపీ నేత‌లు మండి పడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను త‌ప్పు ప‌ట్టిన‌ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల పాటు పాకిస్థాన్ నో ఫ్లై జోన్‌గా ప్రకటించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్‌కు పూర్తి మతి భ్రమించిందని, అందుకే అమ‌ర‌వీరుల త్యాగాన్ని అవ‌మానిస్తున్నార‌ని , గాధీ కటుంబంపై విధేయతను ప్రకటించుకోవడానికే బీజేపీ పై వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని, కేసీఆర్ పై బీజేపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.