Site icon HashtagU Telugu

Uttar Pradesh Election Polls: యూపీలో మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసి బీజేపీ..!

Uttar Pradesh Election 2022 Results Bjp

Uttar Pradesh Election 2022 Results Bjp

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలో అక్క‌డ కౌంటిగ్ గ‌మ‌నిస్తే, యూపీలో మ‌రోసారి బీజేపీ అధికారం చేప‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే యూపీలో మ్యాజిక్ పిగ‌ర్‌ను దాటిన‌ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉత్త‌ర ప్రదేశ్‌లో మొత్తం 403 స్థానాలు ఉండ‌గా, అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగ‌ర్ 202 స్థానాల్లో విజ‌యం సాధించాలి.

అయితే ప్ర‌స్తుతం బీజేపీ అభ్య‌ర్ధులు మొత్తం 238 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో యూపీలో మ‌రోసారి బీజేపీ అధికారాన్నిచేజిక్కించుకోవడం దాదాపు ఖాయంగా కన్పిస్తుంది. ఇక మ‌రోవైపు యూపీ గ‌ట్టి పోటీ ఇస్తుంది సమాజ్ వాదీ పార్టీ. ఈ క్ర‌మంలో స‌మాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు 117 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక‌పోతే బహుజన్ సమాజ్ పార్టీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతుంది. దీంతో ఉత్తర్ ప్రదేశ్‌ను క‌మ‌లం కైవనం చేసుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. మ‌రోవైపు సమాజ్ వాదీ పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అయ్యేటట్లు క‌నిపిస్తుంది.