Site icon HashtagU Telugu

Delhi Rains : ఢిల్లీలో మునిగిన రోడ్లు.. బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన

Delhi Rains

Delhi Rains

ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మునిగిపోవడంపై బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నీళ్లు నిలిచిన రోడ్డుపై తేలికపాటి పడవలో ప్రయాణించారు. వర్షాకాలం ఉందని తెలిసి కూడా ఆప్ ప్రభుత్వం డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోందని విమర్శించారు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారని, ఆప్ నేతలు సిగ్గు పడాలని ఫైరయ్యారు. కౌన్సిలర్ మాట్లాడుతూ వర్షాకాలానికి నగరం సన్నద్ధం కాకపోవడంతో, ” పిడబ్ల్యుడి డ్రైన్లన్నీ పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలం ముందు వాటిని శుభ్రం చేయలేదని, దీంతో వర్షపు నీటితో ఇబ్బంది ఏర్పడిందని… వినోద్ నగర్ నీట మునిగింది.” అని ఆయన మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

భారీ వర్షాల కారణంగా రాజధాని అంతటా నీటి ఎద్దడి ఏర్పడింది, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. NH9తో సహా అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, దీనివల్ల ప్రయాణాలు కష్టతరంగా మారాయి , నివాసితులకు నిరాశే ఎదురైంది. ఆరుగురికి గాయాలయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లోని పైకప్పు భాగం ట్యాక్సీలతో సహా కార్లపై కూలిపోయింది. దీంతో.. ట్యాక్సీలతో సహా కార్లపై ఒక భాగం కూలిపోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి.

Read Also : Facial Recognition: విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి