Karnataka Election 2023: ఖర్గే హత్యకు కుట్ర పన్నుతున్నాడన్న కాంగ్రెస్ ఆరోపణలను కర్ణాటక బీజేపీ అభ్యర్థి మణికాంత్ రాథోడ్ తప్పుబట్టారు. నేనెవరినీ బెదిరించలేదని, దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ఇదంతా చేసిందని, కాంగ్రెస్ ఆరోపణలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయని రాథోడ్ అన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న వీడియోలు అవాస్తవమని, నేను ఎవరినీ బెదిరించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో నేను కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేశాను అని తెలిపారు. .
మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబాన్ని చంపేందుకు బీజేపీ ‘భయంకరమైన కుట్ర’ పన్నుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా బెంగుళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తాపూర్ బిజెపి అభ్యర్థి మణికాంత్ రాథోడ్ ఖర్గేను కించపరిచే పదజాలం ఉపయోగించారని, అతనిని మరియు అతని కుటుంబాన్ని హత్య చేసేందుకు యత్నిస్తున్నట్టు కాంగ్రెస్ ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసింది.
మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబ సభ్యులను హతమార్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అన్నారు. “ప్రధాని మౌనంగా ఉంటారని నాకు తెలుసు, కర్ణాటక పోలీసులు మరియు భారత ఎన్నికల సంఘం కూడా అలానే ఉంటుంది, అయితే కర్ణాటక ప్రజలు మౌనంగా ఉండరని, సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారని ఘాటుగా స్పందించారు.
Read More: Manipur: మణిపూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ ఎత్తివేత..!