Site icon HashtagU Telugu

Telangana BJP:బందును బందు చేసుకున్న బీజేపీ

తెలంగాణలో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త బందుకు పిలునిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయం వెనక్కి తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ జీవోను సవరించాలని బీజేపీ పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తోంది. ఇదే అంశంపై దీక్ష చేస్తున్న సమయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

317 జీవోలో సవరణలు చేపట్టాలనే అంశంతో పాటు, బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దానిలో భాగంగా వివిధ దశల్లో ఉద్యమం ఉదృతం చేస్తూ జనవరి 10న రాష్ట్ర వ్యాప్త బందు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. బందు కు ప్రజలందరూ సహకరించాలని కోరింది. ఈ వార్త అన్ని మీడియాల్లో ఫ్లాష్ అయింది.

అయితే బందు ప్రకటన ఇచ్చిన కొద్ధి సేపట్లోనే బందును ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుపై ప్రకటన వచ్చింది. బందు తో పాటు ఈ నెల 8 నుండి చేపట్టాల్సిన కార్యక్రమాలని కూడా వాయిదా వేసినట్లు తెలిపారు.

ప్రోగ్రామ్ మార్చుకున్నారా? ఏకాభిప్రాయం కుదరకనా? అనే విషయం తెలియట్లేదు కానీ బందుకు పిలుపునిచ్చిన బీజేపీ బందును బందు ఎందుకు చేసుకున్నారో ఆలోచించాల్సిన విషయమే.

Exit mobile version