Ram Mandir: అయోధ్యలో నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అనంతరం భక్తులు అయోధ్య రామయ్యను సందర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ఈ పవిత్ర నగరానికి పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే శాఖ.
రామ మందిర భక్తుల కోసం నల్గొండ నుండి అయోధ్యకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది బీజేపీ. ఫిబ్రవరి 4న 1,400 మంది భక్తులు రాకపోకలు సాగించనున్నట్లు నల్గొండ బీజేపీ ఇన్‌ఛార్జ్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత వాసులకు అయోధ్యను సందర్శించుకునేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. అయోధ్యకు ప్రత్యేక రైలు శ్రీరామ భక్తులకు బహుమతి అని చెప్పారు నాగం వర్షిత్ రెడ్డి.
సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బిజెపి ఎన్నికల వాగ్దానాలలో ఆలయ నిర్మాణం ప్రధానమైనది. అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీదుగా మారి దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంటుంది.
Also Read: HUE Art Exhibition: ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన సురేష్ దగ్గుబాటి