Site icon HashtagU Telugu

TBJP: బీజేపీ హ్యాట్రిక్ సాధించి, మోదీ మూడోసారి ప్రధాని అవుతారు : ఈటల

BJP MP Etala Rajender

BJP MP Etala Rajender

TBJP: గజ్వేల్‌లో సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు.మహిళలు, యువత ప్రధాని మోదీ వెంట ఉన్నాని, ఆయనను మరోసారి గెలిపించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ పాలన ఎటు చూసినా కుంభకోణాలే కనిపించేవని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు.

10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకంతో పేదలకు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ సాధించి, మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ఈటల ఆకాంక్షించారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా రాజరాజేశ్వర క్లస్టర్ – మెదక్ లో రోడ్ షో లో ఈటల పాల్గొని ప్రసంగించించారు. ‘’మోదీ పేద ఇంటి నుండి వచ్చిన బిడ్డ కాబట్టి పేదల కష్టాలు తీరుస్తున్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదు అని ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ 4 కోట్ల ఇల్లు కట్టించి ఇచ్చారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తా అని కేసీఆర్ మోసం చేశాడు. గ్రామపంచాయితీ సిబ్బందికి కూడా మోదీ డబ్బులు పంపించకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెట్లు, లైట్లు, మోరీలు, రోడ్లు అన్నీ కేంద్ర నిధులతోనే వేస్తున్నారు. సఫాయి కార్మికుల కాళ్లుకడిగి గౌరవం పెంచితే, కేసీఆర్ 1700 మంది ఉద్యోగాలు తీసివేశారు.కరోనా వ్యాప్తి సమయంలో దేశానికి ధైరాన్ని అందించిన వ్యక్తి ప్రధాని మోదీఅని ఈటల అన్నారు.

Exit mobile version