Site icon HashtagU Telugu

MP Gorantla: ఎంపీ గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం!

MP Gorantla Madhav

MP Gorantla Madhav

వైసీపీ ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు మాధవ్ అక్కడకు వచ్చారు. అయితే కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాకపోవడంతో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆగిపోయింది.

దీంతో, గోరంట్ల మాధవ్ ను దళిత సంఘాల నేతలు నిలదీశారు. ఎమ్మెల్సీ రాకపోతే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చచెప్పేందుకు మాధవ్ ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో, విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే, పూలదండ వేసి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.