Site icon HashtagU Telugu

J.C Diwakar: ప్రగతిభవన్ వద్ద ‘జేసీ’కి చేదు అనుభవం!

Jc

Jc

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్టయిలే వేరు. తరుచుగా ఏదో ఒక అంశం గురించి మాట్లాడుతూ వార్తాల్లో నిలుస్తుంటారు. సొంతపార్టీ నేతలైనా సరే విమర్శించడానికి వెనుకాడరాయన. ఇక ఆయన ఏదైనా నిరసనలు కార్యక్రమాలు చేపట్టినా.. విభిన్నంగా ఉంటాయి. అందుకే జేసీ అంటే హట్ టాపిక్. అయితే ఈ నేత గతకొంతకాలంగా తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఏపీ రాజకీయాలతో పోల్చితే తెలంగాణ రాజకీయాలే మేలు అని చాలాసార్లు స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఒకటి రెండుసార్లు తెలంగాణ అసెంబ్లీని సైతం విజిట్ చేశారు. తాజాగా ఆయన బుధవారం ఉదయం ప్రగతి భవన్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు వెళ్లినట్టు సమాచారం. అయితే ఎలాంటి అపాయింట్ మెంట్ లేకపోవడంతో పోలీసులు నో చెప్పి అడ్డుకున్నారు. కేటీఆర్ ను కలవాలని పదే పదే చెప్పినా సెక్యూరిటీ వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక జేసీ దివాకర్ ప్రగతి భవన్ రోడ్డు నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది.

Exit mobile version