Site icon HashtagU Telugu

MLC Kavitha: ఘనంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

Kavitha

Kavitha

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం నాడు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  ప్రకటించారు. అయితే నిజామాబాద్  బరిలో కవిత దిగుతారని అందరూ భావించారుు. కానీ కేసీఆర్  బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ అయ్యారు.