Site icon HashtagU Telugu

Bird flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

Bird flu outbreak again..

Bird flu outbreak again..

Bird flu: తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజుల కిందట బర్డ్ ఫ్లూ వణికించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది. దీంతో వినియోగదారులు కూడా చికెన్ సెంటర్ల వైపు పరుగెత్తారు. చికెన్ ధరలు పెరిగినా కొనేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధితో కోళ్లు చనిపోతున్నట్లు అధికారులు నిర్ధారించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓ ఫామ్‌లోని‌ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read Also: Pension Amount: ప్రైవేట్ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. నెలకు రూ. 9000 పెన్షన్‌?

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయని చెబుతున్నారు. దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతం అంతా శానిటైజ్ చేశారు. ఎక్కడైతే కోళ్ల ఫామ్స్ ఉంటాయో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. సమీప గ్రామ ప్రజలను కూడా అటువైపు రావద్దంటూ అధికారులు సూచించారు. వరుస బర్డ్ ఫ్లూ సంఘటనలతో నష్టాల్లో పేరుకపోతున్నామని కోళ్ళ ఫారం యజమానులు, మాంసం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఇక, పశువైద్య అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఆ పౌల్ట్రీఫామ్‌ను సందర్శించారు. మూడు నెలల వరకు ఈ పౌల్ట్రీఫామ్‌ను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ ఫామ్‌లను నిర్వహించుకోవచ్చని తెలిపారు. అక్కడ అధికారులు పీపీఈ కిట్లు ధరించి.. 40 వేల కోళ్లను చంపారు. వాటిని అక్కడే చుట్టు పక్కల ప్రాంతంలో గోతి తీసి పూడ్చిపెట్టారు. వాటితో పాటు దాదాపు 19 వేల కోడిగుడ్లను సైతం పూడ్చి పెట్టారు. అంతే కాకుండా.. ఇదే ఫాంలోని కోళ్ల పెంటను కూడ దహనం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read Also: Tea: నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?