BiparJoy Cyclone : బిపర్‌జాయ్ తుఫాన్ అప్డేట్స్.. కేంద్రం అత్యవసర సమావేశం.. స్కూల్స్ కు సెలవులు..

పశ్చిమ కోస్తా తీర ప్రాంత రాష్ట్రాల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వర్షాలు, వరదలు, తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు.

Published By: HashtagU Telugu Desk
Cyclone Michaung

BiparJoy Cyclone Updates Urgent Meeting by Central Government

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుఫాన్(BiparJoy Cyclone) తీవ్ర రూపం దాల్చనుంది. ఇప్పటికే గుజరాత్(Gujarat), మహారాష్ట్ర(Maharashtra)లో అటు పాకిస్థాన్(Pakisthan) లో కూడా వర్షాలు మొదలయ్యాయి. ఇవి భారీ వర్షాలుగా, భారీ తుఫానుగా మారనుంది. దీంతో వర్షాల(Rains)పై కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ(Delhi)లో అమిత్ షా(Amit Shah) కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. పశ్చిమ కోస్తా తీర ప్రాంత రాష్ట్రాల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వర్షాలు, వరదలు, తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు.

 

బిపర్‌జాయ్ తుఫానుతో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 15 సాయంత్రం అతి తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీంతో కచ్, దేవ్‌భూమి ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్, సౌరాష్ట్రలోని మిగతా జిల్లాలు, గుజరాత్ ఉత్తర ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర గుజరాత్, దక్షిణ రాజస్థాన్‌లో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. అల్లకల్లోలంగా అరేబియా సముద్రం మారడంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. సముద్రంలోకి ఇప్పటికే వెళ్లినవారు, రిగ్‌లపై పనిచేస్తున్నవారిని తీరానికి తిరిగిరావాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.

 

బిపర్‌జాయ్ తుఫానుతో గంటకు సగటున 150-160 కి.మీ వేగంతో భీకర ఈదురు గాలులు, గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగం వరకు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను తాకిడికి కచ్చా గృహాలు, నిర్మాణాలు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని, కచ్ ప్రాంతంలో కచ్చా రోడ్లు, పక్కా రోడ్లు, పంటలు దెబ్బతింటాయని అంచనా వేస్తున్నారు.

తుఫాను ప్రభావిత సముద్ర తీరం నుంచి 10 కి.మీ దూరం వరకు గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కచ్, సౌరాష్ట్రలోని ప్రజలను ఇళ్లను వీడి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే గుజరాత్‌లో ఈ నెల 15 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వీటిని మరింత పొడిగించే అవకాశం ఉంది. ఇక తుఫాను నేపథ్యంలో ఇప్పటికే 60 కి పైగా రైళ్లను రద్దు చేశారు.

 

Also Read : Biparjoy Effect: ముంచుకొస్తున్న బిఫర్ జాయ్ తుఫాన్.. ఏకంగా 67 రైళ్లు రద్దు?

  Last Updated: 13 Jun 2023, 08:44 PM IST