Site icon HashtagU Telugu

Biometric Cloning: వేలిముద్రలు హ్యాక్ చేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!

Finger Prints

Finger Prints

హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.. చివరకు అమాయక ప్రజల ఫింగర్ ప్రింట్లను కూడా వదలడం లేదు. ఫింగర్ ప్రింట్లను హ్యాక్ చేసి, ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ (Aeps) ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. ఈ ముఠా కు చెందిన నలుగురు సభ్యులను మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు మధ్యప్రదేశ్ లోని పలు కస్టమర్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరిస్తారు. వాటిని తమ రహస్య కేంద్రాలకు తీసుకెళ్లి స్కాన్ చేసి.. వేలిముద్రలను క్లోన్ చేస్తారు. అనంతరం ఆ వేలిముద్రల సాయంతో Aeps మార్గంలో .. సదరు ఆధార్ కార్డుదారుడి బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవుతారు. అందులోని డబ్బులను ఎంచక్కా తమ ఖాతాలలోకి పంపించుకుంటారు.

Aeps ఏమిటి ?

దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్ధిక లావాదేవీలను సులువుగా చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన వ్యవస్థే Aeps (ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ). పాయింట్ ఆఫ్ సేల్స్ (pos), మైక్రో ఏటీఎం ల వద్ద కేవలం ఆధార్ నంబరును చెప్పి డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంటుంది.