Site icon HashtagU Telugu

Rakesh Jhunjhunwala : ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత‌

Rakeshjhunjhunwala Imresizer

Rakeshjhunjhunwala Imresizer

ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా క‌న్నుమూశారు. రాకేష్ జున్‌జున్‌వాలా వ‌య‌సు ప్ర‌స్తుతం 62 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జున్‌జున్‌వాలా జూలై 5, 1960న జన్మించారు. ఆయ‌న‌ ముంబైలో పెరిగారు. 1985లో సిడెన్‌హామ్ కళాశాల నుండి పట్టభద్రుడై.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా ఉన్న రేఖా జున్‌జున్‌వాలాను వివాహం చేసుకున్నాడురు. జున్‌జున్‌వాలా RARE ఎంటర్‌ప్రైజెస్ అనే ప్రైవేట్ యాజమాన్యంలోని స్టాక్ ట్రేడింగ్ సంస్థను నడుపుతున్నారు. ఆయ‌న ఈ నెల ప్రారంభంలో భారతదేశపు సరికొత్త విమానయాన సంస్థ అకాసా ఎయిర్‌కు యజమాని ఆయ్యారు.