Site icon HashtagU Telugu

2 Lakh Crores : 2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం పగ్గాలు నాలుగో కొడుకుకు

2 Lakh Crores

2 Lakh Crores

2 Lakh Crores : రాజకీయ పార్టీల వెనుక వ్యాపారవేత్తలు ఉండటం కామన్..  

పొలిటికల్ పార్టీలకు వ్యాపారవేత్తలు చందాలు ఇవ్వడం కామన్..  

అమెరికాలోనూ పొలిటికల్ పార్టీలకు చాలామంది బిజినెస్ మెన్స్ చందాలు ఇస్తుంటారు. 

అలాంటి వాళ్లలో అత్యంత కీలకమైన వ్యక్తి  బిలియనీర్ జార్జ్ సోరోస్.  

ఆయన డెమొక్రటిక్ పార్టీ  సపోర్టర్. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ ది డెమొక్రటిక్ పార్టీయే. 

సోరోస్ కు 2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉంది.. దాని పగ్గాలు తన నాలుగో కొడుకు అలెగ్జాండర్‌ చేతిలో పెట్టాడు..  

2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ (OSF) ను 92 ఏళ్ళ  జార్జ్ సోరోస్ తన కుమారుడు 37 ఏళ్ళ  అలెగ్జాండర్‌ సోరోస్ కు అప్పగించాడు. తన ఐదుగురు పిల్లలలో నాలుగో వాడైన అలెగ్జాండర్‌కు  ఫౌండేషన్‌ బాధ్యతలు ఇస్తున్నానని వెల్లడించాడు.  OSF బోర్డు డిసెంబరులోనే అలెగ్జాండర్‌ సోరోస్‌ను దాని ఛైర్మన్‌గా ఎన్నుకుంది. అమెరికాలో రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం.. రాజకీయ కార్యకలాపాలకు అవసరమైన నిధులను సమకూర్చడం వంటివి చేసేందుకు జార్జ్ సోరోస్ “సూపర్ PAC” అనే ఒక ప్రాజెక్ట్ ను  ఏర్పాటు చేశాడు. దీని ద్వారానే తాము ఎంపిక చేసే అభ్యర్థులకు, పార్టీలకు జార్జ్ సోరోస్ నుంచి ఫండ్స్ అందుతాయి. ఈ “సూపర్ PAC” కమిటీకి కూడా అలెగ్జాండర్‌ సోరోస్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు.

Also read : Mohammad Akhtar: వామ్మో.. ఏనుగుల కోసం ఇన్ని రూ.కోట్ల ఆస్తి రాసిచ్చారా?

రాబోయే సంవత్సరాల్లో సూపర్ PAC ప్రాజెక్ట్  కోసం దాదాపు రూ.1000 కోట్లను ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. అయితే సోరోస్ మేనేజ్‌మెంట్ ఫండ్‌లోని 2 లక్షల కోట్ల రూపాయలలో(2 Lakh Crores) ఎక్కువ భాగం ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ (OSF) యాక్టివిటీ కోసం ఖర్చు చేయనున్నారు. ఇక లక్షల కోట్లు విలువ చేసే సోరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ ఉన్న  ఏకైక కుటుంబ సభ్యుడు కూడా అలెగ్జాండర్‌ సోరోస్‌ మాత్రమే.

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కాకుండా అడ్డుకుంటా : అలెగ్జాండర్‌ సోరోస్‌

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవడం నా మొదటి టార్గెట్. ఎదుటివారు రాజకీయాలను ప్రభావితం  చేస్తున్నంత కాలం మనం కూడా అలా చేయాల్సిందే.. మా నాన్న చూపిన బాటలో నడుస్తా. వాక్  స్వేచ్ఛ, న్యాయ సంస్కరణలు, మైనారిటీ హక్కులు, శరణార్థుల హక్కులు, ఉదారవాద రాజకీయ నాయకులకు మద్దతు అనేవి మేం ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ (OSF) ద్వారా    కొనసాగిస్తాం” అని అలెగ్జాండర్‌ సోరోస్‌ చెప్పాడు.