Site icon HashtagU Telugu

Rowdy Boys:రౌడీ బాయ్స్ సినిమా ఫాన్స్ కి బైక్ గిఫ్ట్

rowdy boys

rowdy boys

రౌడీ బాయ్స్ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దింతో ఆ సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. సినిమా సక్సెస్ ను పంచుకోవడానికి సినిమా థియేటర్స్ వెళ్లి ఫాన్స్ తో సందడి చేస్తున్నారు.

తాజాగా సినిమా యూనిట్ వైజాగ్ లో సందడి చేశారు. థియేటర్ కి బైక్స్ పై ర్యాలీగా వెళ్లి అభిమానులను కలిసి టాక్ తెలుసుకున్నారు. రౌడీ బాయ్స్ చిత్రం ను ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలోని తొమ్మిది పాటలపై త్వరలోనే ఓ మ్యూజికల్ కాంటెస్ట్ పెడతామని అందులో గెలుపొందిన వారికి రౌడీ బాయ్స్ బైక్ గిఫ్ట్ గా ఇస్తామని సినిమా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సినిమాలో హీరోగా ఆషిష్ చాలా అద్భుతంగా నటించాడని, కొత్త వారంతా యాక్టింగ్లో రక్తికట్టించారని ఆయన తెలిపారు.