Site icon HashtagU Telugu

Srikakulam: అబ్బో.. ఎంత పెద్ద హెల్మెట్టో!

Helmet

Helmet

రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది హెల్మెట్ వాడకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హెల్మెట్ వాడకంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని శ్రీకాకుళం ఎస్పీ అమిత్‌బర్దార్‌ కోరారు. ప్రజలకు శిరస్త్రాణం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.  ఏడు రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన శిరస్త్రాణం నమూనా ఆకట్టుకుంది. పోలీసులు అతిపెద్ద హెల్మెట్ ను ప్రదర్శించడంతో వాహనదారులను ఆలోచింపజేస్తోంది. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.