బీహార్ లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. పట్నా జిల్లాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ముఠాల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో రెండు ముఠాలు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. బీహ్తా పీఎస్ పరిధిలోని సోన్ నది తీరంలో ఇసుకను కొందరు మాఫియాగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారు. గురువారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సోన్ నది దగ్గరకు చేరుకున్నారు. మృతులను మానేర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వారుగా గుర్తించారు.
Sand Mafia: రెచ్చిపోయిన ఇసుక మాఫియా…కాల్పుల్లో నలుగురు మృతి..!!

Sand mafia