Site icon HashtagU Telugu

Alcohol: స్మశాస వాటిక‌లో నేపాలీ మద్యం స్వాధీనం

Liquor1

Liquor1

బీహార్ లోని ఓ స్మ‌శాన‌వాటికలో నేపాలీ మ‌ద్యాన్ని బీహార్ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగాసాగర్ చెరువు (వార్డ్ నెం. 29) పక్కన ఉన్న స్మశాన వాటికలో ఈ నేపాలీ బ్రాండ్ మద్యం దొరికింది. చాలా కాలంగా శ్మశాన వాటికలను సాంఘిక వ్యతిరేకులు మద్యాన్ని ఉంచడానికి ఉపయోగిస్తున్నారని స్థానిక నివాసి చాంద్ మహ్మద్ తెలిపారు.

అయితే మ‌ద్యం డంప్ ల‌పై స్థానికులు నిరసన తెలపడంతో మద్యం మాఫియా రెచ్చిపోయింది. స్థానికుల‌పై మ‌ద్యం మాఫియా రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయితే పోలీసులకు సమాచారం అందించడంతో మద్యం స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఇంత‌లో స‌మాచారం అందుకున్న లాహెరియాసరాయ్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ), హెచ్‌ఎన్ సింగ్, బెంటా ఓపీ ఇన్‌చార్జి ఉమేష్ కుమార్ పోలీసులతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము శ్మశాన వాటికలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామ‌ని ఉమేష్ కుమార్ తెలిపారు. మొత్తం రికవరీ 294 లీటర్లకు చేరుకుంద‌ని… మద్యం స్మగ్లర్లను గుర్తించి.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బెంట ఓపీ ఇన్‌చార్జి తెలిపారు.