Delhi: హోంమంత్రి అమిత్ షాకు నితీష్ ఫోన్..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం పాట్నా వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. అంతకుముందు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.

Delhi: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీనికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం పాట్నా వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. అంతకుముందు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.

మంగళవారం నాటి కౌంటింగ్, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు దృష్ట్యా ప్రధానమంత్రి నివాసంలో ప్రధాని మోదీతో సమావేశం కావడం, బీజేపీ వ్యూహకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నితీశ్ కుమార్ ఫోన్‌లో మాట్లాడడం వంటివి రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అమిత్ షాతో ఫోన్ సంభాషణకు కొన్ని గంటల ముందు ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీ, నితీష్ కుమార్ మధ్య 35 నిమిషాలకు పైగా సంభాషణ జరిగింది.

రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోదీ, అమిత్ షాలకు తెలియజేసినట్లు చెబుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ సమావేశం జరిగింది.

Also Read: Taj Express Train Fire: ఢిల్లీలోని తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం