Site icon HashtagU Telugu

CM Nitish Kumar : సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. ఫుట్‌పాత్‌పైకి దూకిన సీఎం.. అస‌లేం జ‌రిగిందంటే..?

Cm Nitish Kumar

Cm Nitish Kumar

బీహార్ సీఎం నితీష్ కుమార్ (CM Nitish Kumar) కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. గురువారం ఉద‌యం నితీష్ కుమార్‌ మార్నింగ్ వాక్ (Morning walk) చేసేందుకు ఇంటి నుంచి స‌ర్క్యుల‌ర్ రోడ్డుకు వెళ్లారు. ఆ మార్గంలో పోలీసులు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. అయితే, అదే స‌మ‌యంలో ఇద్ద‌రు వ్య‌క్తులు బైక్‌పై ఆ మార్గంలోకి వేగంగా దూసుకొచ్చారు. వీరిని గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది ఆపే ప్ర‌య‌త్నం చేసినా వారు ఆగ‌కుండా సీఎం నితీష్ కుమార్‌ ద‌గ్గ‌రికి దూసుకెళ్లారు. అప్ర‌మ‌త్త‌మైన సిఎం నితీష్ కుమార్ పుట్‌పాత్‌పైకి ఎగిరిదూక‌డంతో తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఎస్ఎస్‌జీ భ‌ద్ర‌తా సిబ్బంది బైక్‌పై వెళ్తున్న‌వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఘ‌ట‌న త‌రువాత‌ సీఎం నితీష్ కుమార్ భ‌ద్ర‌తా సిబ్బందితో స‌మావేశం అయ్యారు. అయితే, బైక్‌పై వ‌చ్చిన‌వారు చైన్‌స్నాచ‌ర్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించ‌గా.. మేము కావాల‌ని చేయ‌లేద‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై పాట్నా పోలీస్ ప్ర‌తినిధి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గురువారం ఉద‌యం 5.45 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్య‌క్తులు ఉన్నార‌ని, ఇద్ద‌రు బైక్‌పై స‌ర్క్యూల‌ర్ రోడ్డువైపు దూసుకురాగా, మ‌రో స్నాచ‌ర్ వేరే ప్ర‌దేశంలో ఉన్నాడ‌ని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని వీరి ఇళ్ల‌కు వెళ్లి త‌నిఖీలు చేయ‌గా.. మొబైల్ ఫోన్లు, చార్జ‌ర్లు, ఇత‌ర సామాగ్రిని ఉన్న‌ట్లు గుర్తించ‌డం జ‌రిగింద‌ని పోలీస్ ప్ర‌తినిధి చెప్పారు.

ఆ వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకొని సీడీఆర్ స్కాన్‌కోసం ల్యాబ్ కు పంపించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. వారిని విచారించ‌గా.. త‌మ నేరాల‌ను అంగీక‌రించార‌ని, బోర్డింగ్‌ రోడ్ చౌక్ వ‌ద్ద ఓ మ‌హిళ‌ మెడ‌నుంచి గొలుసును లాక్కున్న త‌ర్వాత‌, స‌ర్క్యూల‌ర్ రోడ్డువైపుకు దూసుకొచ్చారు. అక్క‌డ వారిని ఆపాల‌ని పోలీసులు సూచించ‌డంతో భ‌యాందోళ‌న‌కు గురైన‌వారు.. వేగంగా డ్రైవ్ చేసి చివ‌రికి సీఎం వాకింగ్ చేసే ప్ర‌దేశం వ‌ద్ద‌కు చేరుకున్నారు. మూడో నిందితుడిని కూడా అరెస్టు చేయ‌డం జ‌రిగింద‌ని పోలీస్ ప్ర‌తినిధి తెలిపారు.

Temple: ఆలయానికి వెళ్తున్నారా.. అయితే అలా అస్సలు చేయకండి?