Site icon HashtagU Telugu

Exit Polls: బీహార్, జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయ్‌.. గెలుపు ఎవ‌రిదంటే?

Exit Polls

Exit Polls

Exit Polls: బీహార్ శాసనసభ ఎన్నికలు-2025 ముగిసిన నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ (Exit Polls) ఫలితాలు అధికారంలోకి రాబోయే కూటమిపై స్పష్టమైన అంచనాను ఇచ్చాయి. ఈ సర్వే ప్రకారం.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. తిరిగి బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది.

ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం

చాణక్య సర్వే ప్రకారం.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 130 నుండి 138 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. NDA కూటమిలో ప్రధాన భాగస్వాములైన పార్టీల అంచనా సీట్లు ఇలా ఉన్నాయి.

మహా గఠ్‌బంధన్ (MGB) అంచనా

మరోవైపు మహా గఠ్‌బంధన్ (MGB) కూటమి ఎన్డీఏ కంటే వెనుకబడి 100 నుండి 108 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

MGB కూటమిలోని ముఖ్య పార్టీల అంచనా సీట్లు

ఇతర పార్టీల పరిస్థితి

మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ 3 నుండి 5 స్థానాలు, రిపబ్లికన్ లోక్ మోర్చా (RLM) 2 నుండి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) 2 నుండి 3 స్థానాలు గెలుచుకోవచ్చు. చాణక్య సర్వే ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో NDA కూటమి విజయం సాధించే దిశగా పయనిస్తోంది. నవంబర్ 14న (ఫలితాల రోజు) విడుదలయ్యే తుది ఫలితాల కోసం ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Exit Polls: ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏమిటి?

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల

రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. ఈ పోల్స్ ప్రకారం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనేక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ ఉపఎన్నిక ఫలితం నవంబర్ 14న వెలువడనుంది.

ప్రధాన సర్వేల అంచనాలు ఇవే

వివిధ సర్వే సంస్థలు ఓట్ల శాతం ఆధారంగా ఇచ్చిన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.

చాణక్య స్ట్రాటజీస్

పీపుల్స్ పల్స్

నాగన్న సర్వే

స్మార్ట్ పోల్

ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్ల శాతం లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్ తీవ్ర పోటీ ఇచ్చినా.. కాంగ్రెస్ కొద్దిపాటి ఆధిక్యంతో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేల అంచనా సారాంశం తెలియజేస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమే. తుది ఫలితం కోసం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version