Site icon HashtagU Telugu

Bihar: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు మృతి

Baba Siddhnath Temple

Baba Siddhnath Temple

Bihar: బీహార్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్ లోని జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లోని చారిత్రాత్మక వనవర్ కొండపై ఉన్న సిద్ధేశ్వరనాథ్ ఆలయ సముదాయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మరణించగా, డజనుకు పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు.

బీహార్‌లోని సిద్ధేశ్వరనాథ్ ఆలయ సముదాయంలో రాత్రి 1 గంట ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. నాలుగో రోజైన సోమవారం జలాభిషేకానికి భక్తులు భారీగా తరలివచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో తొక్కిసలాట జరిగి భక్తులు అటు ఇటు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడిన భక్తులలో ఏడుగురు మరణించారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అందరూ చనిపోయినట్లు వైద్యలు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆలయం, ఆస్పత్రి ఆవరణలో విషాదం నెలకొంది.

చనిపోయిన వారి వివరాలు:
మృతుల్లో సుశీలాదేవి, పూనమ్ దేవి, నిషా కుమారి, నిషా దేవి రాజు కుమార్‌లుగా గుర్తించారు. అందరూ మఖ్దుంపూర్ వాసులుగా చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెహనాబాద్‌ పోస్ట్‌మార్టం హౌస్‌కు తరలించారు.

ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారు?
దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారని సంఘటనా స్థలంలో ఉన్న ప్రజలు తెలిపారు. గుడిలోకి వెళ్లేందుకు గుంపులు గుంపులుగా జనం పరుగులు తీస్తుండగా,పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి జరిగిన వెంటనే తొక్కిసలాట జరిగి ఈ పెను ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ భద్రతలో తీవ్ర లోపం ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. ప్రతి ఆది, సోమవారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే భద్రత పేరుతో ముగ్గురు పోలీసులు, ఎన్‌సిసి బెటాలియన్‌లు మాత్రమే ఉండడంతో జనాన్ని అదుపు చేయలేకపోయారు.

దర్శనానికి వచ్చిన భక్తులు మరణించడం బాధాకరమని జెహనాబాద్‌ ఎస్‌డిఓ వికాస్‌కుమార్‌ తెలిపారు. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి. మేము పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.మరోవైపు సంఘటనా స్థలాన్ని డీఎం, ఎస్పీ సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ దివాకర్ కుమార్ విశ్వకర్మ చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు.

Also Read: Greece Wildfire : గ్రీస్ రాజధానికి చేరువలో కార్చిచ్చు.. ఏథెన్స్‌లో హైఅలర్ట్