Site icon HashtagU Telugu

Bigg Boss OTT: నాన్ స్టాప్ ఎంటర్‏టైన్‏మెంట్.. బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది..

Bigboss Ott

Bigboss Ott

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్, తెలుగులో 5 సీజ‌న్లు కంప్లీట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ నాలుగు సీజ‌న్లు సూప‌ర్ హిట్ అవ‌గా, 5వ సీజ‌న్ మాత్రం ప్రేక్ష‌కులు ఆశించినంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. గ‌త బిగ్‌బాస్ సీజన్‌లో గేమ్స్, టాస్కుల కంటే కంటెస్టెంట్స్ ప్ర‌వ‌ర్త‌న‌లు శ్రుతిమించిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు కంటెస్టెంట్స్ చేష్ట‌లు హ‌ద్దులు దాట‌డంతో ప్రేక్ష‌కుల‌కు విసుగుపుట్టించాయి. ఈ క్ర‌మంలో టీఆర్పీ కూడా బారీగా ప‌డిపోవ‌డంతో, బిగ్‌బాస్ షో య‌జ‌మానులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా టీఆర్పీ రేటింగ్స్ మాత్రం పెంచ‌లేక‌పోయారు.

ఈ నేప‌ధ్యంలో బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈసారి 24 గంటల ఎంటర్‏టైన్‏మెంట్ అందించేందుకు, తెలుగు బిగ్‏బాస్‌ను ఓటీటీ ఓటీటీలో టెలికాస్ట్ చేయాల‌ని, ప్లాన్ చేస్తున్న‌ట్లు గ‌తంలోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవల తెలుగు బిగ్‏బాస్ ఓటీటీ లోగో విడుదల చేసిన బిగ్‌బాస్ నిర్వాహ‌కులు, తాజాగా తెలుగు బిగ్ బాస్ ఓటీటీ అఫీషియల్ ప్రోమోను విడుదల చేశారు. త్వరలోనే తెలుగు బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతుంద‌ని, ఇక‌పై నేరుగా బిగ్‌బాస్ ఇంటి నుంచే ప్రేక్ష‌కుల్ని నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ పొందేందుకు సిద్ధంగా ఉండాలని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ చేసింది. ఇక న‌యా సీజ‌న్‌లో పాత కంటెస్టెంట్లతో పాటు, పలువురు కొత్త కంటెస్టెంట్లు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని స‌మాచారం.